సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో స్థానిక కేశవరావు హైస్కూల్ గ్రౌండ్ లో సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభలను నేడు,సోమవారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా పట్టణ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సభలలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో నేడు సోమవారం వేడుకలు ఘనంగా ప్రారంభించారు. కేరళ రాష్ట్ర మంత్రి రాజీవ్ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్పోరేటి కరణ కారణంగా కార్మిక హక్కులు హరించివేస్తున్నారని దీనిని దేశవ్యాప్తంగా సీఐటీయూ ప్రతిఘటిస్తుందన్నారు. భీమవరం పట్టణ విధులలో వేదిక పరిసర ప్రాంతాలులో అన్ని ఎర్రజెండలతో అరుణోదయం కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వీధుల ఉక్కు ప్రవేటీకరణ మానుకోవాలని నినాదాలతో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ సభలకు సీఐటీయూ రాష్ట్ర స్థాయి నేతలు,రాష్ట్ర కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాద్జి ల్లా జిల్లాలో సిపిఎం కీలక నేతలు సీతారాం , బలరాం, JV గోపాలన్, L వాసుదేవరావుతో పాటు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ నేతృత్వం వహిస్తున్నారు.
