సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పంచ వ్యాప్తంగా నేడు, ముస్లీమ్ సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భీమవరంలో స్థానిక పెద్ద మసీదు, మరియు 3 టౌన్ లోని ఈద్ గాహ్, ఇంకాపట్టణములోని పలు మసీదుల వద్ద నేడు, శనివారం ఉదయం నుండి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగించిన, వేలాది మంది ముస్లీమ్ సోదరులు అల్లా ను ప్రపంచ మానవాళి శాంతి సౌభాగ్యాల కోసం నమాజులు చేసారు. ఈ పవిత్ర నెలలోనే, దేవుడు సంతోషించే మానవ విలువలను బోధించే.. దివ్య ఖురాన్ గ్రంధాన్ని మానవాళి కి ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. మసీదుల ఆవరణలో ఉన్న బీదసాదలకు దానధర్మాలు చేసి కులమతాలకు అతీతంగా తమ మిత్రులను ఆలింగనాలు చేసుకొని, ఇండ్లకు వెళ్లి సేమియాలా పాయసలు, బిర్యానీలతో బంధుమిత్రులల్తో ఉల్ల్లాసంగా గడిపారు.ఈ సందర్భముగా ప్రపంచ వ్యాప్తంగా మన ‘ సిగ్మా న్యూస్’ ను వీక్షిస్తున్న ముస్లీమ్ లందరికి, మిత్రులకు ‘అల్లా’ అస్సిసులు ఉండాలని కోరుకొంటున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *