సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా నేడు, ముస్లీమ్ సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో స్థానిక పెద్ద మసీదు, మరియు 3 టౌన్ లోని ఈద్ గాహ్, ఇంకా పలు మసీదుల వద్ద నేడు, సోమవారం ఉదయం నుండి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగించిన, వేలాది మంది ముస్లీమ్ సోదరులు అల్లా ను ప్రపంచ మానవాళి శాంతి సౌభాగ్యాల కోసం నమాజులు చేసారు. ఈ పవిత్ర నెలలోనే, దేవుడు సంతోషించే మానవ ప్రవర్తన,జీవిత విలువలను బోధించే.. దివ్య ఖురాన్ ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. మసీదుల ఆవరణలో ఉన్న బీదసాదలకు దానధర్మాలు చేసి కులమతాలకు అతీతంగా తమ మిత్రులను ఆలింగనాలు చేసుకొని, ఇండ్లకు వెళ్లి సేమియాలా పాయసలు, బిర్యానీలతో బంధుమిత్రులల్తో పబ్లిక్ హోలీ డే కూడా కావడంతో ఉల్ల్లాసంగా గడుపుతున్నారు. .రంజాన్‌మాసం హృదయ సంస్కరణకు దోహదపడే మాసంగా ముస్లింలు తమ హృదయాల్లో అల్లాను నింపుకుని ప్రార్థనలు చేస్తారు. మహ్మద్ ప్రవక్త హజరత్ మహ్మద్ ఏడాదిలోని 12 మాసాల్లో ఒక మాసం ఉదయం నుండి సాయంత్రం వరకు నోటిలో ఉమ్మిని కూడా మింగకుండా బయటకు ఉమ్మి పరమ నిష్ఠగా పూర్తీ సహనంతో ఉపవాస దీక్షను కొనసాగించడం విశేషం. నేడు సోమవారం ఉదయం స్థానిక ముస్లీమ్ పెద్దలు సమక్షంలో భీమవరంలోని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషను రాజు నివాసం లో రంజాన్ వేడుకలు నిర్వహించారు. (ఫై చిత్రంలో)
