సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో వాడవాడలా నేడు, బుధవారం స్థానిక యువత ఆధ్వర్యంలో వందలాది చవితి పందిళ్ళ సందడి కనిపించింది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షపు ముసురు నేపథ్యంలో నేడు, బుధవారం మరింత జోరుగా ఉదయం నుండి ఏకధాటిగా వర్షం పడుతూనే ఉండటంతో పందిళ్ళలో ఉత్సవ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూజ కార్యక్రమాలు చాల ఆలస్యం అయ్యాయి. గత రాత్రి కురిసిన వర్షానికి పూజ సామాగ్రి , విగ్రహాలు కొనుగోలు చెయ్యలేక చాల మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రతి ఇంట నేడు, భక్తి శ్రద్దలతో గణ నాదులకు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి వర్షం నెమ్మదించింది.అయితే భీమవరం పట్టణం అంతటా ఓ రేంజ్ లో భారీ స్థాయిలోఅందమైన పందిళ్లు వేసి పంచమ రాత్రులు,నవ రాత్రులు , నిర్వహిస్తున్నారు. ఈసారి 11 రోజులు ఉత్సవాలు బాగా తగ్గిపోయాయి. ఇక భీమవరం పట్టణంలో స్థానిక శ్రీ గణేష్ దేవాలయాలతో పాటు మెంటే వారి తోటలో, రెస్ట్ హౌస్ రోడ్డు , దుర్గాపురం లోను , గునుపూడి లోను స్థానిక గన్నాబత్తుల వారి వీధి, మోటుపల్లి వారి వీధి , శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ కళా వేదికపై,సుంకర పదయ్యా వీధి, పంచా రామం వద్ద పరిసరాలలో కూడా విశేషముగా భారీ పందిళ్ళలో చక్కటి వినాయకులు 7 -12 అడుగుల వరకు భారీ విగ్రహ రూపాలలో పూజలు అందుకొంటున్నారు. ఇక 2 టౌన్, 3 టౌన్ లలో, అపార్ట్మెంట్స్ లో కూడా చక్కటి నిర్వహణ తీరుతో పలు చోట్లా శ్రీ వినాయక పందిళ్లు ఏర్పాటు చేసారు.అందమైన లైటింగ్ , సాంసృతిక కార్యక్రమాలతో నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *