సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అశేషంగా ఉన్న కృష్ణ & మహేష్ బాబు అభిమానులు సహకారంతో నేడు, మంగళవారం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ స్థానిక ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద పార్క్ లో మధ్యాహ్నం సమయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానులు, మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం తరువాత అక్కడే సమీపంలో లో వున్న త్యాగరాజ భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సూపర్ స్టార్ కృష్ణ సోదరులు సినీ నిర్మాత, ఘట్టమనేని అది శేషగిరిరావు, ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాస్ తదితరులతో పాటు స్థానిక పట్టణ ప్రముఖులు మరియు సీనియర్ కృష్ణ అభిమానులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, కనకరాజు సూరి, బీహెచ్ సుబ్బరాజు, గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ .. తెలుగు సినిమా చరిత్ర ఆవిష్కరణలలో తోలి అడుగు ఆయనదేనని.. కృష్ణకు ఉన్న మాస్ క్రేజ్ అనితర సాధ్యం అని , అల్లూరి సీతారామరాజు గ ఆయన అభినయం చిరస్థాయిగా నిలిచిపోతుందని సాహసం, పౌరుషం, మంచి తనం కు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిల్చి 350 సినిమాలలో హీరోగా నటించిన ఏకైక హీరో కృష్ణ మాత్రమే నని వక్తలు కొనియాడుతూ ఆయన తో వారి అనుభూతులు పంచుకొన్నారు.
