సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శనివారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా భీమవరం వైసిపి పార్టీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , ఇతర వైసీపీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం పేదలకు పళ్ళు పంపిణి చేసారు. దివంగత వై యస్ బౌతికంగా మరణించిన అయన హయాంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి తో ప్రజలు గుండెలలో జీవించే ఉన్నారని, ఆయన తనయుడుగా సీఎం జగన్ ప్రజా సంక్షేమానికి తన తండ్రి ని గుర్తు చేస్తూ మరో 4 అడుగులు ముందుకే వేస్తున్నారని అన్నారు. తదుపరి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నియోజక వర్గంలో కొత్తగా అర్హత పింఛను సాధించిన లబ్దిదారులకు మంజూరైన 652 కొత్త పెన్షన్ల..ను పత్రాలను అందజేశారు. వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేసారు. తదుపరి నియోజకవర్గంలో పలు వై ఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, స్వర్గీయ YS సంస్మరణ కార్యక్రమాలలో ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్ ఇతర స్థానిక వైసిపి నేతలతో కలసి పాల్గొన్నారు. రోగులకు పండ్లు, పేదలకు దుస్తులు పంపిణి చేసిన వైసిపి పార్టీ కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *