సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయ పార్టీలు స్వర్ధలు ఎన్నికల వరకే.. తరువాత అన్ని పార్టీల నేతలు ఒకరినొకరు అబ్బాయి.. బాబాయ్..మామయ్య.. పిలుపులతో అత్మియముగా .. కలసి మెలసి వ్యాపారాలు చేసుకొనే సంస్కృతీ ఉన్న భీమవరంలో యువగళం వివాదాల దాడుల..వ్యక్తిగత బూతులు.. ప్రభావంతో పరిస్థితి తీవ్ర కేసులు పెట్టుకొనే స్థాయికి వెళ్ళటం దురదుష్టకరం.. విషయంలోకి వెళ్ళితే.. టీడీపీ నేతల ప్రాద్భలంతోనే భీమవరంలో గునుపూడి ప్రాంతంలో స్థానిక వైసిపి కార్యకర్తలు ప్రజలు పై దాడులు జరిగాయని భావించిన పోలీసులు 44 మంది టీడీపీ RED వలంటీర్ల అరెస్ట్ తో పాటు 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులపై కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మం డలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కిం ద పోలీసులు కేసు నమోదు చేశారు.
