సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నేడు, సోమవారం మద్యాహ్నం నుండి హరేరామ- హరే కృష్ణ.. నినాదాలు తో హోరెత్తింది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘శ్రీ జగన్నాధుని రధోత్సవం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వన్ టౌన్ లోని గునుపూడి పంచారామ క్షేత్రం నుండి అక్కడ ఏర్పాటు చేసిన అందమైన రంగవల్లులు మీదుగా రథంలో పూరికి చెందిన శ్రీ కృష్ణ, బలరామ, సుభద్ర దేవి నమూనా మూర్తులు కొలువై ఉండగా.. ( ఫై చిత్రంలో) వర్షపు చిరు జల్లుల మధ్య మేళతాళాలతో భక్తుల ఉత్సహంతో లాగుతుండంతో స్థానిక భీమేశ్వర స్వామి గుడి వైపుగా తటవర్తి వారి వీధి గుండా పయనించి 2 టౌన్ లోని ఏ ఎస్ ఆర్ కాలనీ లోని అల్లూరి సీతారామరాజు సాంసృతిక మండపం వరకు ఈ రథయాత్ర నిర్వహించారు. సుమారు 4 కిలోమీటర్లు మేర రధం లాగుతూ హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనలతో భక్తులు , మహిళలు, చిన్నారులు తరించారు. తదుపరి నేటి సాయంత్రం నుండి ASR మండపం లో గురువులచే శ్రీ కృష్ణ ప్రవచనాలు , భక్తులకు ప్రసాద వితరణలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.
