సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపాలిటీల్లో కొద్దీ రోజులుగా పారిశుధ్య పనివారు ఇండ్ల వద్ద చెత్త సేకరణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తడి చెత్త.. పొడి చెత్త.. అంటూ మైక్ లో వాయిస్ వినిపిస్తూ.. ఇంటిటా చెత్త పట్టుకొనివెళ్ళడానికి వచ్చే వాహనాలు సిబ్బంది దసరా రోజుల నుండి సక్రమంగా విధులకు హాజరు కాకపోవటంతో గత 10 రోజులుగా వాహనాలు మూలకు చేరాయి. దానితో భీమవరం మునిసిపాలిటీలో పారిశుధ్య పనివారు ప్రతి రోజు వచ్చి చెత్త తీసుకొనివెళ్లే సంప్రదాయానికి మధ్య మధ్య కొంత విరామాలు ఇస్తున్నారు. తోపుడు వాహనాలలో ఇంటిటికి వెళ్లి కొందరు చెత్త సేకరిస్తున్నారు. క్లాప్ వాహనాలు (చెత్తసేకరణ వాహనాలు) సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో విధులకు హాజరు కావటంలేదు అని చెబుతున్నారు. అసలే వర్షాలు పడుతున్నాయి. అసలే డెంగ్యూ జ్వరాలు పెరిగిపోయాయి, మరో ప్రక్క మరోప్రక్క చెత్తసేకరణ పూర్తిస్థాయిలో జరగటంలేదు. ఈ వాహనాలు 2022 అక్టోబరు నెల నుంచి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో వినియోగంలోకి వచ్చాయి. చక్కగా విధులు నిర్వహిస్తున్నాయి. జిల్లామొత్తం మీద 100 కి పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నిర్వహణ సిబ్బంది జీతాలు రాకపోవడంతో జిల్లాలో మిగతా మున్సిపాలిటీ లలో కూడా ఇదే తరహా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతి త్వరలో సమస్య పరిష్కారం కావాలని కోరుకొందాం.
