సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని ఒక కన్వరెన్స్ హాల్లో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి చెవి ముక్కు గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశంలో భాగంగా నేడు, శనివారం ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్యులు డా నడింపల్లి రాజన్ రాజుకు జీవిత సాఫల్య పురస్కార అవార్డు, లెజెండ్ ఆఫ్ ఈఎన్ టీ అవార్డులను పద్మశ్రీ డా జేఎమ్ హ్యాన్స్, పద్మశ్రీ డా మిలింద్ వి కీర్ తనే, డా కేకే రామలింగం లకు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ శాసనమండలి చైర్మెన్, మోషేను రాజు, స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు, DNR కార్యదర్శి గాదిరాజు బాబు, ఆశ్రమ వైద్య కళాశాల డైరెక్టర్ రతీదేవి, రాష్ట్ర అధ్యక్షులు డా నడింపల్లి శంకర్ కుమార్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా గొట్టుముక్కల బాలకృష్ణంరాజు,AS రాజు డా శేఖర్ రెడ్డి, డా హరినాథ్, డా పిఎస్ఎన్ మూర్తి, డా మధుసూదన్ రావు, డా ఎన్ ప్రభాకర్ రావు, డా ఎస్ కే అప్పారావు, డా శ్రీనాథ్, డా కుమార్ చౌదరి, డా పాపారావు, డా సూర్యప్రకాష్ రావు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డాక్టర్లు పాల్గొన్నారు , వక్తలు మాట్లాడుతూ..మానవ శరీరంలో గుండె మాత్రమే ప్రధానమైని అనుకుంటారు గానీ చెవి ముక్కు గొంతు కూడా ఎంతో ముఖ్యమని ప్రపంచ వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సల్లో సైతం విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని ఇటువంటి సదస్సులు వైద్య రంగానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు.
