సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని నేడు, గురువారం భీమవరం ప్రకాశం చౌక్ లో ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, ప్రజలు చేనేత వస్త్రాలు కొనుగోలు ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అన్ని కాలాలకు తగినట్లు చేనేత వస్త్రాలు ధరించడంలో సౌలభ్యంతోపాటు, ఆరోగ్యపరంగా కూడా మంచి చేకూరుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 95 శాతం చేనేత ఉత్పత్తులు మన దేశం నుండే ఉన్నాయని, నేటి యువతకు చేనేత వస్త్రాల గురించి పెద్దలు చెప్తే గానీ తెలియని విషయంగా మారిందన్నారు. అనంతరం ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ రావి రాంబాబు కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
