సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విశేషంగా ఆహుతులను అలరిస్తున్న చైతన్య భారతి 17వ జాతీయస్థాయి నాటికల పోటీలు గత ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్ర ప్రస్థం” నాటిక ఉత్తమ ప్రదర్శన, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి “నిశ్శబ్దమా నీ ఖరీదెంత” ద్వితీయ స్థానం, చైతన్య కళా భారతి కరీంనగర్ వారి “స్వప్నం రాల్చిన అమృతం “నాటికలు తృతీయ ప్రదర్శన సాధించాయని చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. జ్యూరీ ప్రదర్శనగా కళంజలి హైదారాబాద్ వారి ” రైతే రాజు”, ఉత్తమ రచన మూల్యం రచయిత సింహ ప్రసాద్, ఉత్తమ దర్శకత్వం ఎన్ రవీంద్ర రెడ్డి, ఉత్తమ నటుడు కుమార్ పాత్రధారి సి వరప్రసాద్ ( నిశ్శబ్దమా నీ ఖరీదెంత), ఉత్తమ నటి చుక్కమ్మ పాత్రధారిణి నాగరాణి ( విముక్తి), ఉత్తమ ప్రతి నాయకురాలు పాత్రధారి సరిత (ఎనిమి), ఉత్తమ హాస్యనటుడు వి సురేష్ (ఎనిమి), ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కే సూర్యనారాయణ (స్వప్నం రాల్చిన అమృతం), ఉత్తమ క్యారెక్టర్ నటి వసంత యామిని (మనస్విని), సంగీతం (ఇంద్ర ప్రస్థం), ఉత్తమ మేకప్ మనస్విని, ఉత్తమ లైటింగ్ కౌసల్య సుప్రజ రామా, జ్యూరి బహుమతి శ్రావ్య, కావ్య (ఎనిమి), సాయి, సుప్రియ (స్వప్నం రాల్చిన అమృతం) అందించామని తెలిపారు. కార్యక్రమంలో రాయప్రోలు శ్రీనివాస మూర్తి,కట్రైడ్డి సత్యనారాయణ,భట్టిప్రోలు శ్రీనివాసరావు ( BSR )బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, కాగిత వెంకటరమణ, శ్రీమతి భీశెట్టి జ్యోతిరాజ్,పెన్నాడ శ్రీను, వెస్టబెర్రీ డైరెక్టర్ నడింపల్లి మహేష్, వడుపు గోపి, కె. వి. రమణ మూర్తి న్యాయ నిర్ణతలు గా మానాపురం సత్యనారాయణ ( పాలకొల్లు )డా ” N V. కృష్ణారావు ( గుంటూరు, పంపన దయానంద బాబు ( కాకినాడ ) వ్యవహరించారుకనుమరుగవుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి నాటక పరిషత్‌లు చేస్తున్న కృషి ఎనలేనిదని పలువురు వక్తలు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *