సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 30,31, జూన్ 1,2 తేదీల్లో భీమవరం లోని డిఎన్నార్ కళాశాల ఇంగ్లిష్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో… చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. నేడు,సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 30న, జాతీయస్థాయి నాటిక పోటీలను ప్రముఖుల సమక్షంలో ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో కే విశ్వనాధ్, సిరి వెన్నెల , ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వంటి సినీ సాహితి దిగ్గజాలు తమ వైదికపై సన్మానాలు అందుకొన్నారని.. 30న సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు, నాటక రచయిత డా పురాణం వెంకట రామ్ కుమార్ కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటులు దర్శకులు జనాబ్ ఎస్ఎం భాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, జూన్ 2న అజో విభో కందాళం ఫౌండేషన్ అప్ అమెరికా వ్యవస్థాపకులు అప్పాజ్యోసుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్ర మూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి ఎం రత్నకుమారికు పెనుపోతుల శేషగిరిరావు హార్దిక చైతన్య పురస్కారం అందిస్తున్నామని తెలిపారు. 4 రోజులపాటు 9 నాటికలను నిర్వహిస్తున్నామని, ఈనెల 30న గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి “మూల్యం”, 31న కళంజలి హైదరాబాద్ వారి “రైతే రాజు “, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి “మనస్విని”, ఉషోదయ కళానికేతన్ వారి “విముక్తి”, జూన్ 1న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి “ఇంద్ర ప్రస్థం“, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి “నిశ్శబ్దామా ! నీ ఖరీదెంత”, శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరు వారి “కౌసల్యా సుప్రజ రామా”, 2న చైతన్య కళాభారతి కరీంనగర్ వారి “స్వప్నం రాల్చిన అమృతం”, విటిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వారి “ఎనిమి”నాటికలను ప్రదర్శిస్తారని, ఈ నాటక పోటీలను అందరూ తిలకించి జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో రాయప్రోలు శ్రీనివాస మూర్తి, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, డా.కట్రెడ్డి సత్యనారాయణ,పెన్నాడ శ్రీను, పేరిచర్ల లక్ష్మణ వర్మ, కనగర్ల రామకృష్ణ, ఆర్టిస్ట్ జ్యోతి రాజ్, కాగిత వెంకట రమణ,ముచ్చకరచలహేమమసుందర్, తదితరులు పాల్గొన్నారు.
