సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి ఏడాదిలానే తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ప్రతిష్టాకరంగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉన్నత ప్రమాణాలతో.. ఈ ఏప్రిల్ నెల 24,25,26,27 తేదీల్లో భీమవరంలోని డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో “చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటిక పోటీలను 4రోజులు పాటు 10 నాటికలను ప్రదర్శిస్తున్నట్లు, చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంతెన రామకుమార్ రాజు, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. నేడు, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈనెల 24న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి జాతీయస్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. 27న ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్, కోయ్యే మోషేన్ రాజు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈనెల 24న సినీ నటులు, రచయిత మిశ్రో కు చుక్కన సత్యనారాయణ రాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాల కు పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం, సినీనటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, 27న రంగస్థల నటులు బాలాజీ నాయక్ కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, చవాకుల సత్యనారాయణ కు రాయప్రోలు రామచంద్ర మూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, సినీ దర్శకులు వివేక్ ఆత్రేయ కు ఆత్మీయ సత్కారం జరుగుతాయని తెలిపారు. సమావేశంలో వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, రాయప్రోలు శ్రీనివాస మూర్తి, బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, చెఱకుపల్లి రవి, ‘వెస్ట్ బెర్రీ’ మహేష్, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నడ శ్రీను,తదితర సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *