సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రా వ్యాప్తంగా జన సైనికులు …’జగనన్న ఇల్లు పేదవారికి కన్నళ్లు’ అన్న నినాదంతో నేటి శనివారం నుండి 3 రోజుల పాటు సెంటు భూమిలో పేదలకు కడుతున్న ఇళ్ళు నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా భీమవరం జనసేన నేతలు, జిల్లా అధ్యక్షుడు , భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు నేతృత్వంలో స్థానిక పైపుల చెరువు దగ్గర ఉన్నటువంటి స్థలములో పాక్షికంగా నిర్మాణాలు జరిగిన ఇళ్లును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడ ప్లై కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భముగా చినబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం పాలన లోకి వచ్చేందుకు నవరత్నాలను నెరవేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అందులోని (జగనన్న ఇళ్ళు) తో ప్రతిఒక్క పేదవాడి కలను నెరవేరుస్తామని మాటలు చెప్పి నేడు అదొక స్కాం గా భూకంభకోణం కొనసాగిస్తున్నారని వారి బండారాన్ని బయట పెడతామని, ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్ళ మధ్య 2 అడుగుల దూరం మాత్రమే ఉందని , లోతుగా ఉండి నీళ్లలో చేపలు కూడా పట్టామని ఎద్దేవా చేసారు. మౌళిక వసతులు కల్పన లేదని, పట్టణానికి బాగా దూరంగా ఉండటంతో ఆటో కూడా రాదని, పేదలకు ఇచ్చిన స్థలములో కనీస సౌకర్యాలు .. రోడ్లు సౌకర్యం, వాటర్ ట్యాంక్, పైప్ లైన్ కలిపించకపోవడం దారుణం అని ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేస్తామని అన్నారు. . ఈ కార్యక్రమంలో రాష్ట్ర PAC సభ్యులు కనకరాజు సూరి , పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్ , సెక్రెటరీ సుంకర రవి, బండి రమేష్ కుమార్, మండల సెక్రటరీ కత్తుల నీలంద్ర , మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరి బాబు, మాగపు ప్రసాద్,MpTC అరెటి వాసు, లక్కోజు నాని, త్రివిక్రమ్,తదితరులు పాల్గొన్నారు.
