సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : భీమవరం పట్టణం మున్సిపల్ ఆఫీస్ యందు నేడు, బుధవారం భీమవరం మున్సిపల్ కమిషనర్, శ్యామల దేవి ఆధ్వర్యంలో, జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ధ్వారా లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణి ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అతిధులుగా, సబ్ – కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ , పశ్చిమ గోదావరి జిల్లా DCMS చైర్మన్ వేండ్ర వెంకట స్వామి హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతి అని, ప్రతి పేదకుటుంబానికి స్వంత ఇల్లు ఉండాలని, అదికూడా ఎటువంటి లొసుగులు లేకుండా పూర్తీ ఇంటి హక్కుదారులుగా ప్రభుత్వ గుర్తింపు తో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా మీకు పట్టాలు ఇస్తున్నారని, మీరు కూడా వాస్తవం అర్ధం చేసుకొని తప్పుడు ప్రచారం విశ్వసించక ఈ రోజు ఇంత పెద్దస్థాయిలో వచ్చి పట్టాలు అందుకోవడం శుభ పరిణామం అని హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో భీమవరం మండల ZPTC కాండ్రేగుల నరసింహ రావు, MPP పెరిచర్ల నరసింహారాజు , AMC చైర్మన్ తిరుమాని ఏడుకొండలు , బీసీ.. కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరావు గారు, AS రాజు ,తోట భోగయ్య , మరియు మునిసిపల్ అధికారులు , వైసిపి నేతలు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు…..
