సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో స్థానిక పాత గోవర్ధన టాకీస్ సెంటర్ లో త్వరలో నూతనంగా ప్రారంభించబడుతున్న ” జనరిక్ మెడికల్ ‘ షాపును జిల్లా DCMS చైర్మన్ వేండ్ర వెంకట స్వామి నేడు, సోమవారం పరిశీలించడం జరిగింది. ఆరోగ్యం కాపాడే మందులు ధరలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు అతితక్కువ ధరకు , మంచి ప్రమాణాలు నాణ్యత తో కూడా జనరిక్ మందులు అందజేయాలని, అదికూడా పట్టణ ప్రధాన సెంటర్ లో ఉంటె ఎక్కువమంది ప్రజలకు మెడిసెన్స్ కొనుగోళ్ళకు అందుబాటులో ఉంటాయని ఉద్దేశ్యంతో, డిసిఎంఎస్ తరుపున ప్రజలకు స్వచ్చందంగా సేవలు అందించాలని ఇక్కడ మెడికల్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని అందరు సద్వినియోగ పరుచుకోవాలని DCMS చైర్మన్ వేండ్ర వెంకట స్వామి పిలుపు నిచ్చారు.
