సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులకు గత రాత్రి బి పారమ్స్ ఇచ్చి నేడు, గురువారం వారిని పైనల్ చేస్తూ అధికారిక ప్రకటన చేసిన నేపథ్యంలో భీమవరం పట్టణంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరియు భీమవరం జనసేన పార్టీ కార్యాలయం నందు అడ్జక్షులు కోటికల పూడి గోవిందరావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి తదుపరి ఉదయం 11 గంటలకు భీమవరం జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపిక అయిన పులపర్తి రామాంజనేయులు ను అయనకు చెందిన మల్టీప్లెక్స్ వద్ద విశేషంగా హాజరు అయిన జనసేన నేతలు క్యాడర్ తమ మధ్య విభేదాలు మరచి ఆయనకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జనసేనలో భిన్న ధ్రువాలు చినబాబు, వీరవాసరం జడ్ పి టి సి, గుండా జయప్రకాశ్.. ఒకే వేదికపై అంబాబు ను అభినందించడం విశేషం.. టీడీపీ , బీజేపీ నేతలతో కలసి అధినేత పవన్ ఆదేశాల ప్రకారం అంజిబాబు భీమవరం నుండి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రతిన పూనారు, అంజిబాబు మాట్లాడుతూ..కళ్యాణ్ గారు ఒక మెరుగైన సమాజం కోసం ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా అదృష్టం అలాగే నన్ను MlA అభ్యర్ధిగా ప్రకటించినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేసారుఅంజిబాబు అందరిని కలుపుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించి పవన్ ఆశయాలను నిలబెడతానని ప్రకటించారు. తదుపరి మధ్యాహ్నం స్థానిక అల్లూరి సీతారామరాజు సాంసృతిక మండపంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం లైవ్ ద్వారా వీక్షించారు. అక్కడ అంజిబాబు ను భీమవరం అభ్యర్థిగా అధికారికంగా పవన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు, ఎంపీటీసి లు, వార్డ్ మెంబర్లు, గ్రామ అధ్యక్షులు ,నాయకులు,జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
