సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కొటికలపూడి గోవిందరావు జన్మదిన వేడుకలు.. భీమవరం పార్టీ నేతల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం లో గోవిందరావు (చినబాబు)పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.పట్టణంలో మజ్జిగ పంపిణి కార్యక్రమం, తాడేరు జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో భోజన పంపిణీ కార్యక్రమం, ఉండి నియోజకవర్గం మహాదేవపట్నంలో బీరువాలు పంపిణి మరియు భోజనం పంపిణి కార్యక్రమం, చెనమల్ల చంద్ర శేఖర్ ఆఫీస్ నందు హోప్ ఫౌండేషన్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్, చిన్నమిరం వృద్ధాశ్రమంలో భోజనం పంపిణీ, ప్రభుత్వ హాస్పటల్ నందు ఫ్రూట్స్& బ్రెడ్ పంపిణి కార్యక్రమం,ప్రకాశం చౌక్ నందు అన్న వితరణ కార్యక్రమం మరియు భీమవరం మండలం,వీరవాసరం మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి &పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్,పట్టణ సెక్రటరీ సుంకర రవి, భీమవరం నియోజకవర్గం నాయకులు బండి రమేష్ కుమార్,భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, మండల సెక్రటరీ కత్తుల నీలెంద్ర, మాజీ కౌన్సిలర్స్ వానపల్లి సూరిబాబు, మాగాపు ప్రసాద్, పంతం ప్రసాద్,కాళీ శేఖర్, దారపురెడ్డి త్రివిక్రమ్ తదితర జనసైనికులు, వీరమహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *