సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామ స్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చెయ్యడం లో భాగంగా భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం లో గల అనాకోడేరు, రామాయణపురం గ్రామాల్లో కమిటలను నేడు, శుక్రవారము జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజవర్గ ఇంఛార్జి గోవిందరావు నియమించడం జరిగింది. అనాకోడేరు జనసేన అధ్యక్షునిగా గొర్ల నాగరాజు, రామాయణపురం అడ్జక్షునిగా యర్రంశెట్టి సాయి పవన్ ను ఇతర కమిటీ సభ్యులను నియమిస్తూ ..చినబాబు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కమిటీలను నియమించి పార్టీని మరింతబలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం పట్టణ అధ్యక్షుడు చేనమల్ల చంద్ర శేఖర్, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, సెక్రటరీ కత్తుల నీలెంద్ర, పట్టణ సెక్రటరీ సుంకర రవి,నాయకులు బండి రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ వానపల్లీ సూరిబాబు, కాళీ శేఖర్, ఆతికల ఆంజనేయ ప్రసాద్, త్రివిక్రం, గ్రామాల కమిటి సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
