సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో జనసేన పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజవర్గ ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు(చినబాబు )ని ఇటీవల నూతనంగా నియామకమైన జనసేన భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్ నేడు, గురువారం మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో చినబాబు మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నుండి జనసేన పార్టీ బలోపేతానికి . ప్రజా సమస్యల పట్ల పోరాటానికి సిద్ధంగా ఉండాలని,అప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన పార్టీ కి మంచి భవిషత్తు ప్రజలు కలుగజేస్తారని జనసేన క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసెన ప్రజా ప్రతినిధులు, నేతలు గొల్లవాని తిప్ప mptc శ్రీ తాత పూడి రాంబాబు , తుందుర్రు mptc ఆరేటి వాసు భీమవరం మండల కార్యదర్శి నిలేంద్ర ,ఆంజనేయులు , బలరామకృష్ణ , యతం రామకృష్ణ , పల్ల పోతు శ్రీను, నాగిడిఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు
