సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గ ఇంచార్జి గోవిందరావు నేడు, సోమవారం ఇటీవల మృతి చెందిన ఇద్దరు జనసేన నాయకులు కుటుంబాలను పరామర్శించి వారికీ పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. అందులో భాగంగా స్థానిక బ్యాంక్ కాలనీ నందు అనారోగ్య కారణంగా ఇటీవల మృతి చెందిన తూరుపాటి నాగేశ్వరావు చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తదుపరి తాడేరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన జనసేన నాయకుడు రవణం దొరబాబు (43) గుండెపోటుతో మరణించగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శలలో పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్, నాయకులు బండి రమేష్ కుమార్, కత్తుల నీలెంద్ర, పాపోలు ఆంజనేయులు,చెన్ను రవి, రామాయణం శ్రీనివాస్,ఉండవల్లి శ్రీనివాస్, అతికెల ఆంజనేయ ప్రసాద్, కాళీ శేఖర్, ఆకుల శ్రీనివాస్  ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *