సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ నెల 19 వ తేదీన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చారిత్రాత్మకంగా జరుగనున్న అంబేడ్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా, నేడు, మంగళవారం భీమవరం పట్టణములో ‘జన భాగీ దారి’ కార్యక్రమం నిర్వహించినట్లు మునిసిపల్ కమిషనర్ శ్రీమతి యన్. శ్యామల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ శాసన మండలి చైర్మన్, కోయ్యే మోషే ను రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, డా.బి.ఆర్.అంబేడ్కర్ చౌక్ లోని డా.బి. ఆర్ .అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ ఎంతో దార్శినికత గల నాయకుడనీ, ప్రపంచ మేధావి అనీ, యావత్ భారత దేశం గర్వించ దగ్గ నాయకుడన్నారు. అలాంటి మహానుభావుని 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఈ నెల 19 వ తేదీన ఆవిష్కరించనున్నారనీ , ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి భీమవరం ఆర్ డి ఒ, జి.శ్రీనివాసులు రాజు ఎ.పి. యస్.సి.వెల్ఫేర్ అసోసియేషన్, భీమవరం మండల శాఖ అధ్యక్షుడు డా. ఎ. వీరయ్య , డా.యన్.విజయ కుమార్, పి.రాజ బాబు, కె.సి.రాజు ,తదితరులు పాల్గొన్నారు.
