సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ నటి జామున మృతి కి భీమవరం పట్టణంలో పలువురు సినీ అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. 2016 లో జరిగిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 52వ వార్షికోత్సవంలో శ్రీమతి జమున గారికి పట్టణ వీధులలో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి,వేలాది భక్తుల సమక్షంలో సువర్ణ కంఠాభరణంతో స్వర్గీయ మానేపల్లి పేరయ్య ఆధ్వర్యంలో నీరుల్లి కూరగాయ వర్తక సంఘం సభ్యులు శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ వారిచే ఘన సన్మానం చేయుట జరిగినది అని.. అంతటి మహానటి వృద్యాప్యంతో మృతి చెందటం పట్ల ఉత్సవ కమిటీ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది. అప్పటి జామున గారి సన్మాన సభలో పాల్గొనే అవకాశం రావడం తన భాగ్యంగా భావిస్తున్నట్లు శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ కమిటీ మాజీ చైర్మెన్, కారుమూరి సత్యనారాయణ పేర్కొన్నారు.( up file photo)
