సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: 3 దశాబ్దాలుగా బీజేపీ క్యాడర్ కు ఆంధ్ర ప్రదేశ్ లో పట్టు ఉన్న నియోజకవర్గం లో నేడు, మంగళవారం నాలుగవ సారి బీజేపీ రాష్ట్ర సమావేశం స్థానిక ఆనంద హాలులో ప్రారంభం అయ్యింది. దీనికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అధ్యక్షత వహించగా కేంద్ర మంత్రులు మురళీ ధరన్, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, జాతీయ నేతలు సునీల్ దియోధర్ జీ, శివప్రకాశ్ జీ, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, జీవిఎల్ నరసింహరావు ఎమ్మెల్సీలు మాధవ్, నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు అంబికా కృష్ణ, విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, పాకా సత్యనారాయణ, శివన్నారాయణ, శ్రీనివాసవర్మ, సుభాష్ తదితరులు హాజరు అయ్యారు. వచ్చే 2024 లో ఏపీ ఎన్నికలలో బీజేపీ సంచలన విజయాలు సాధించే దిశగా పార్టీని బలోపేతం చేసి, రాష్ట్రానికి, దేశానికీ ప్రధాని మోడీ చేసిన ప్రయోజనాలు ప్రజలు దృష్టికి తీసుకోని వెళ్లాలని , కరోనా సమయంలో దేశంలో ప్రజలను ప్రధాని మోడీ రక్షించారని, విభజన తరువాత AP లో 2014 నుండి చంద్రబాబు హయాంలో అవినీతి పెరిగిపోయిందని,ఇక్కడి వైసిపి, టీడీపీ లు కుటుంభ పార్టీల వల్ల ప్రజలకు మేలు లేదని వాటిని ప్రజలకు దూరం చెయ్యడమే బీజేపీ లక్ష్యం అని వక్తలు బీజేపీ రాష్ట్ర కేడర్ కు పిలుపు నిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా సోము వీర్రాజు కొనసాగుతారని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎపి సహా ఇంఛార్జి సునీల్ దేవదర్ భీమవరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో ప్రకటించారు. మీడియాతో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరశింహరావు మాట్లాడుతూ…టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలకు బీజేపీ దూరం..జనసేన తో కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం అన్నారు. ఇక కార్యక్రమ నిర్వహణ విషయానికి వస్తే.. .గతంలో 3సారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భీమవరంలో చాల ఘనంగా నిర్వహించిన బీజేపీ రాష్ట్ర సమావేశాలతో పోలిస్తే ఈసారి నిర్వహించిన ఈ కార్యక్రమం లో కీలక నేతల ఆగమనం భారీగా ఉన్నపటికీ .. కీలక ప్రకటనలు లేవు.. అలాగే కార్యక్రమ నిర్వహణలో మీడియా తో సమన్వయ లోపాలు కనిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *