సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం ఉదయం భీమవరం జేపీ రోడ్డులోని ఆనందా ఇన్ లో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, బీజేపీ రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ పాల్గొని, శ్రీ కృష్ణుని విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన తదుపరి, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో యాదవ సోదరులు అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,కారుమూరి నాగేశ్వర రావు, జిల్లా యాదవ సంఘం నాయకులు విశేషంగా పాల్గొన్నారు.
