సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పారాజు వెంకటేశ్వర్లు పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ ఉద్యోగులతో, JAC నాయకులు తో భీమవరం ప్యాడి అండ్ రైస్ అసోసియేషన్ భవనంలో సమావేశం అయ్యారు…ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ తహశీల్దార్ లు మరియు రెవెన్యూ ఉద్యోగులు ల్యాండ్, రీసర్వే, ఎలక్షన్స్ విధులు, సర్వీస్ మేటర్స్, సమస్యలు, పని ఒత్తిడి, తదితర సమస్యలు వాటి పరిష్కర మార్గాలు ప్రస్తావించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీ మునిసిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున ఎస్ కృష్ణ మోహన్ మునిసిపల్ ఉద్యొగుల సమస్యలు సభ దృష్టికి తీసుకొనివచ్చారు. ఈ నెల తేదీ 30.09.2023 న విజయవాడ రెవిన్యూ భవనం నందు జరగబోయే రాష్ట్ర ఎన్నికలు మరియు తేదీ 01.10.2023 న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించే 17 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశము ను జయప్రదం చెయ్యాలి అని కోరారు.ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *