సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ముందు ప్రభుత్వ విఆర్ఎ లు తమ సమస్యలపై దశలవారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో (వారి ప్రధాన డిమాండ్స్ అయిన పే స్కేలు అమలుచేయాలని, నామీనులుగా పనిచేస్తున్న వారందరిని విఆర్ఎలుగా నియమించాలని, అర్హులకు విఆర్డీఓ, అటెండర్, వాచ్మెన్ ప్రమోషన్స్ ఇవ్వాలని, డిఎ రికవరీ నిలిపి డిఏ తో కూడిన వేతనం అమలు చెయ్యాలి) నేటి ఉదయం జనసేన పార్టీ తరఫున ఉమ్మడి పశ్చిమ జిల్లా అధ్యక్షులు,కొటికలపూడి గోవిందరావు గారు వారికి సంఘీభావం తెలియజేశారు. అయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాదయాత్రలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తానని మాట ఇచ్చి తీరా ఓట్లు వేసిన తర్వాత వీళ్ళను మోసం చేశారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున వీఆర్ఏలకు జనసేన పార్టీ న్యాయం చేకూరుస్తామని పార్టీ ఎప్పుడూ వీళ్ళకి అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తిగ నాగరాజు , నాయకులు తదితర మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, నాయకులు, MpTC లు,కార్యకర్తలు, జనాసైనికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *