సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్నంలో సంక్రాంతి సంబరాలు , శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే వేలాది మంది అతిధులకు అదనపు ఆకర్షణ, ఆహ్లదం కలిగించడానికి స్థానిక లూథరన్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు, వైసిపి యువత రాష్ట్ర నాయకులు గ్రంధి రవితేజ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో అన్ని ద్రిల్స్ ఐటమ్స్ తో పాటు లండన్ బ్రీజ్ సెట్ ప్రత్యక ఆకర్షణగా నిలచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ కార్యకలాపాల్లో ఎంతో బిజీగా ఉంటారని, అయితే పండుగ సమయాల్లో మాత్రం కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారని, అందుకే ఈ ఎగ్జిబిషన్ ను ప్రతి కుటుంబ సభ్యులకు ఆహ్లాద వాతావరణంను కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు , వైసిపి నేతలు సుంకర బాబురావు, తోట భోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *