సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడు, గురువారం ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3,729 ఓటర్లు కోసం 20 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం భీమవరం లో 144 సెక్షన్ అమలులో ఉంది. స్థానిక చింతల పాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. భీమవరం లో 759 టీచర్స్ ఓట్లు ఉన్నాయి. 5గురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండగా.. కీలక అభ్యర్థిగా హోరాహోరీగా తలపడుతూ బరిలో నిలచిన స్థానిక ఉపాద్యాయుడు బొర్రా గోపిమూర్తి ఇక్కడే ఓటు హక్కును ఉపయోగించుకొన్నారు. ( ఫై చిత్రంలో చూడవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *