సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర సమర యోధులకు , డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ కు ఘన నివాళ్లు అర్పించారు.టిడిపి కార్యాలయంపై నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జాతీయ జెండా ఎగురవేసి 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం జనవరి 26 తేదీన ఏర్పడిన భారతదేశ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని తెలిపారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ సభ ద్వారా మనకు ఇచ్చిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందామన్నారు. ఈకార్యక్రమం లో స్థానిక రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు పాల్గొన్నారు.
