సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్నవారికి సీఎం చంద్రబాబు ఆద్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. నేడు, మంగళవారం భీమవరం నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో ఇద్దరు లబ్దిదారులకు రూ 6,01,288ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. భీమవరం 39వ దుర్గాపురంకి చెందిన దండెల నాగబాబుకు రూ 3 లక్షల 50 వేలు, రాయలం గ్రామానికి చెందిన మానుకొండ కిరణ్ కుమార్ కు రూ 2,51,288 లను ఎల్ఓసి ద్వారా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య, పట్టణ నేతలు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,మద్దుల రాము, , కోళ్ల సీతారామయ్య,రాయపల్లి వెంకట్ , నేదునూరి గంగాధరం, గొలగాని రమేష్, నడింపల్లి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *