సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు రాజకీయ నైతిక విలువలతో టీడీపీ లోనే కొనసాగుతున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ భీమవరం కు చెందిన మెంటే పార్ధ సారధి.. ఈయన గతంలో పలు మారులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అడ్జక్షుడిగా, ఏపీ ఆర్టీసీ శాతవాహన రీజనల్ చైర్మెన్ గా మునిసిపల్ వైస్ చైర్మెన్ గా పనిచేసారు. మెంటే పార్థసారథి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్నారు. భీమవరంలో అన్ని పార్టీల వారు గౌరవిస్తారు, ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర లో జరిగిన వివాదాలు గతంలో ఎప్పుడు జరగలేదని విచారం వ్యక్తం చేసారు. ఇది పోలిసుల వైఫల్యం అన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఒకటవ పట్టణ సీఐ అడబాల శ్రీనివాసులుకు తన నిరసనను తెలియజేశారు. పాదయాత్రలో లోకేష్ పై ,తమ నాయకులు, కార్యకర్తలపై కూడా దాడులు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వెంటనే అరెస్టు చేయాలని మెంటే డిమాండ్ చేశారు.. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుకు గాయాలయ్యాయన్నారు. పోలీసులు, లోకేష్ పాదయాత్ర చేస్తున్న గునుపూడి దారిలో ఆందోళన చేస్తున్న వైసిపి కార్యకర్తలు ను ముందే వారించి వారిని అక్కడ లేకుండా చేస్తే ఘర్షణలు జరిగేవి కావన్నారు. అయితే ఎప్పడు ఉద్రిక్తలు తలెత్తిన టీడీపీ వారితో పాటు నన్ను పోలీసులు పలుమారులు హౌస్ అరెస్ట్ చేసేవారని ఇప్పుడు వైసిపి వారిని ఎందుకు కంట్రోల్ చెయ్యలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం కార్యకర్తలకు భీమవరం ఏ ప్రాంతం వారిపై, ఏ పార్టీల వారిపై ఎక్కడైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయా? అంటూ ఆయన ప్రశ్నించారు.. తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి వంటి వారిపై ఎలా కేసులు పెడతారంటూ ఆయన ప్రశ్నించారు.
