సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆనంద హాలులో నేడు, సోమవారం మధ్యాహ్నం నుండి కవిశేఖర’ డాక్టర్. ఉమర్ అలీషా సాహితి సమితి ఆధ్వర్యంలో ఆయన 78వ వర్ధంతి సభ ను వందలాది సాహితి అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ అడ్జక్షులు, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతులమీదుగా ఉమర్ అలీషా పురస్కారాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ సాహితి విశ్లేషకులు కిరణ్ ప్రభ అందుకోగా, శ్రీ హుస్సేన్ షా కవి పురస్కారాన్ని హైదరాబాద్ కు చెందిన సత్యవోలు లలితా కృష్ణ ప్రసాదరావు అందుకొన్నారు. ముఖ్య ఆహ్వానితులుగా ఆనంద గ్రూప్ చైర్మెన్ ఉద్దరాజు ఆనందరాజు సమక్షంలో ఉమర్ అలీషా పీఠం కార్యదర్శి , మాటల మాంత్రికుడు దాయన చంద్రజీ మాస్టర్ వ్యాఖ్యానం తో సభికులను అలరించింది. తెలుగులో సాహితి విలువలను కాపాడుతూ.. భవిషత్తు తరాలకు తెలుగు సాహితి గొప్పతనం పరిపుష్టంగా అందిస్తున్న ఉమర్ అలీషా సాహితి సమితి వారి కృషిని వక్తలు, ఆహుతులు అభినందించారు.
