సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం , భీమవరం లో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి, వెంకయ్య నాయుడు ముందుగా ఉదయం 8 గంటలకు విష్ణు పూర్ లోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ గెస్టు హౌస్ కు చేరుకొని కొద్దీ విరామం తరువాత బివి రాజు విద్యాసంస్థల అధినేత పద్మ విభూషణ్ డాక్టర్ బీవీ రాజు దంపతుల స్మారక మందిరం వద్ద ఘన నివాళ్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో , బివి రాజు విష్ణు సంస్థల చైర్మెన్ విష్ణు రాజు మరియు మాజీ ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలసిన రాష్ట్ర శాసనమండలి ఛైర్మెన్ కొయ్యే మోషేను రాజు, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ కూడా పాల్గొన్నారు. తదుపరి కాలేజీ ఆవరణలో ఉన్న దేవాలయం లో దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. నేటి మధ్యాహ్నం విష్ణు ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *