సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిసర ప్రాంతాలలో పూర్తిగా కనుచూపు లేని లేదా పాక్షిక అందత్వం కలిగిన విద్యార్థులకు ఉద్దరాజు వెంక సుబ్బరాజ మెమోరియల్ కంటి ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో ఉచిత విద్యా బోధన కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని స్కూల్ నిర్వాహకులు , ప్రముఖ కంటి వైద్యులు గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ యువీ రమణరాజు మన సిగ్మా న్యూస్ కు తెలిపారు. 2004 నుంచి తాను అంధుల కోసం ఉచిత పాఠశాలలను నిర్వహిస్తున్నామని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందంతో విద్యాబోధన చేస్తుండగా ఇక్కడ విద్యనభ్యనించిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని రమణరాజు చెప్పారు. 30 ఏళ్లలోపు వయస్సు కలిగిన అర్హత కలిగిన విద్యార్థులు శాలలో చేరవచ్చునన్నారు. తమ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు దాతల సహకారంతో ప్రయాణ సౌకర్యంతోపాటు, మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు డాక్టర్ రమణరాజు తెలిపారు. అడ్మిషన్ల వివరాల కోసం 08816 222383, 08816 222 444 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. 2 దశాబ్దాలుగా ‘అంధుల భవిషత్తు’ కోసం విశేష కృషి చేస్తున్న డాక్టర్ రమణరాజు అందరికి మార్గదర్శకులు.. ..
