సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : బీజేపీ పార్టీ కి గత 3 దశాబ్దాలు నుండి అంతో ఇంతో క్యాడర్ ,బలమైన నేతలు, మంచి పట్టు ఉన్న ప్రాంతం, 2 సారులు లోక్ సభ స్థానం గెలిచిన ప్రాంతం ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ‘ప్రవాస్ యోజనలో’ భాగంగా 3 రోజులుగా సంస్థాగత నిర్మాణం పైనే క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను ప్రేరేపించేలా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాజకీయ ప్రమేయం లేని తటస్తులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం లో ప్రముఖ నేత్ర వైద్యులు ఉద్దరాజు రమణ రాజు ను స్వయంగా కలిసి ఆయన కళ్ళు లేని అందులకు చేస్తున్న సేవలకు ప్రశంసిస్తూ.. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భముగా సోము వీర్రాజు మాట్లాడుతూ..డాక్టర్ రమణరాజు దశాబ్దాలుగా మంచి హస్తవాసి ఉన్ననేత్ర వైద్యుడుగానే కాకుండా సమాజం పట్ల అభ్యుదయ భావాలతో చిన్నారి అంధుల పట్ల సేవా దృక్పథాన్ని కలిగి గత 20 సంవత్సరాలు కాలం నుండి వారికీ ఉచితంగా సేవలు అందించడం తో పాటువారిలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సహాలు, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ యు.వి రమణ రాజు ను అందరూ ఆదర్శం గా తీసుకోవాలన్నారు బదిర విద్యార్థులకు డాక్టర్ రమణరాజు స్వయంగా ఆయన నివాసంలో పాఠశాల నిర్వహించడంతో అక్కడ విద్యార్థులతో మాట్లాడి సోమువీర్రాజు ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాసరాజు ఇతర స్థానిక బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *