సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతరత్న డా బిఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని భీమవరంలో పలు చోట్ల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి స్థానికులు నేతలు ఘన నివాళ్లు అర్పించారు. భీమవరం ప్రధాన అంబేడ్కర్ సెంటర్ లో ఎపి ఎస్సీ వెల్పర్ అసోసియేషన్ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రతిఒక్కరికి చదువుకునే హక్కు కల్పించిన ఘనత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ దేనని, అంబేడ్కర్ ఒక వర్గానికి చెందిన వారుకాదని అందరి వారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ వో బి శివనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎపి ఎస్సీ వెల్పర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ డా ఏ వీరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, ఆర్గనైజింగ్ పెదపాటి రాజబాబు, విజ్జురోతి రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. ఇక భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయంలో అంబేడ్కర్ ఫొటోకు పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా సమాజంలో అట్టడుగు వర్గాలకు అందరితో సమానవత్వం కల్పించిన ఆశాజ్యోతి గా అంబేడ్కర్ ను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సెలర్స్ ప్రముఖులు పాల్గొన్నారు.
