సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం నుండి భీమవరంలో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులు తరువాత పునః ప్రారంభం నేపథ్యంలో.. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి భీమవరం పిఎస్ఎం బాలికొన్నత మున్సిపల్ హైస్కూల్లో ట్రెసబిలిటీతో ఫైన్ క్వాలిటీ పోర్టీపైడ్ (సన్న ) బియ్యంతో తయారు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. తదుపరి వారుభోజనం నాణ్యతను గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. ఇదే క్వాలిటీ కొనసాగించాలని నిర్వాహకులను కోరారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ లను అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రావి రాంబాబు, కూటమి నాయకులు కార్యకర్తలు హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు,
