సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు గురువారం ఉదయం భీమవరంలోని ఓవర్ బ్రీజ్ దిగువున ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లో చౌక ధరలకు టమాటా, వంట నూనెలు, ఉల్లిపాయలు అమ్మకాలకు ఏర్పాటు చేసిన అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు.. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో రోజు రోజుకు కూరగాయలు, వంట నూనెలు, ఉల్లిపాయల ధరలు పెరిగిపోవడం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు వినియోగం భారంగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సబ్సిడీ ధరలకు జిల్లాలోని రైతు బజార్ ల ద్వారా అమ్మకాలను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా భీమవరంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో షాపును కూడా ప్రారంభించడం జరిగిందని, జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం రైతు బజార్లలో, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రధాన కేంద్రములలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలను చేపట్టినట్లు తెలిపారు. కిలో టమాట రూ 50, ఉల్లిపాయలు కర్నూల్ రకం కిలో రూ32, మహారాష్ట్ర రకం కిలో రూ 47, పామాయిల్ ప్యాకెట్ రూ 119, సన్ఫ్లవర్ ప్యాకెట్ రూ 127 చొప్పున అమ్మకాలు చేస్తున్నట్లు వివరించారు. వినియోగదారులు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకువచ్చి ఒక్కొక్క కిలో చొప్పున నిర్ణీత ధర చెల్లించి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా, స్థానిక అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *