సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్ ఫై భారత్ త్రిదళ సేనలు ఆపరేషన్ సింధూర్ తో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నేడు శనివారం భీమవరంలో మువ్వనేల జండాలు చేత బూని తిరంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ,భీమవరం- విస్సాకోడేరు వంతెన వద్ద నుండి జువ్వలపాలెంరోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విస్సాకోడేరు వంతెన వద్ద . ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ , మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజు, ఉమ్మడిజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు , బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవిఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ క్షేత్రాల నాయకులు, కార్యకర్తలు, మాజీ జవాన్లు ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వర్మ తదితర వక్తలు మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో భారత్ సేనలు సత్తా , అధునాత ఆయుధాల సత్తా పాకిస్తాన్ తో పాటు ప్రపంచానికి తెలిసిందని భారత్ సేనకు విజయోత్సవ అభినందనలు తెలిపారు
