సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి 4 రోజుల పండుగ సందడి ముగియడంతో బంధు మిత్రులంతా నిన్న సాయంత్రం నుండి భారమైన మనస్సులతో తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళుతున్నారు. భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బస్సులు, రైళ్ల రద్దీతో తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. నిజానికి నిన్నటి సాయంత్రం నుండే ప్రయాణాలు మొదలయ్యాయి. మరికొందరు మరో 2 రోజులు బందు మితృలతో కాలక్షేపం చేస్తూ ఏకంగా ఆదివారం నుండి తమ దూరప్రాంతాలకు సిద్ధం అవుతున్నారు. తిరుగు ప్రయాణంలో బస్సు, రైళ్లు, ప్రైవేట్‌ సర్వీసుల రద్దీతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రవేట్ బస్సులు వాహనాల డిమాండ్ మాములుగా లేదు. ప్రైవేటు బస్సుల నిర్వాహ కులు కొందరు తెలివిగా ముందుగానే టిక్కెట్లు లేవంటూ చెప్పి బస్సు వస్తే ఖాళీ సీట్లు ఉంటే చూదాం.. అంటూ మరింత పెంచి టికెట్స్ అమ్ముకొంటున్న వైనాలు కనపడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన సెంటర్ లతో పాటు బంధువులు, మిత్రులు పెద్దసంఖ్యలో వాహనా లపై రావడంతో గ్రామాల్లో అధిక సంఖ్యలో కార్లు వారికీ వీడ్కోలు పలుకుతున్న బందు మిత్రుల సన్నివేశాలు కనిపిస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *