సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణలో భాగంగా నేడు, సోమవారం భీమవరం పట్టణం 1 వార్డు మెంటేవారితోటలో భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ టిడిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి జండా స్థూపాన్ని ప్రారంభించి టిడిపి జెండా ఆవిష్కరించారు. స్థానిక పట్టణంలోని 3,10,16,17,18,19 వార్డులలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మార్చి 29న తెలుగుదేశంపార్టీని ప్రకటించినందున ,పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారని, అందుకే తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని ఆవిర్భావ దినోత్సవం వారం రోజులు ముందుగానే నియోజకవర్గంలోని వాడవాడలా టిడిపి జెండా పండుగను నిర్వహించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. డిపి రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ,కార్పొరేషన్స్ డైరెక్టర్లు,పామర్తి వెంకటరామయ్య ఉప్పులూరి చంద్రశేఖర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ ఎండి షబీనా మరియు మాజీ కౌన్సెలర్స్ ఎద్దు ఏసుపాదం, ఐజాక్ బాబు, మెంట్ గోపి, ఎండి నౌషాద్ చల్లబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
