సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఒకనాటి బీజేపీ ప్రముఖులు .. ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్న ఎన్ ఇంద్రసేన రెడ్డి భీమవరంలో పలు విద్య, సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భీమవరంలో పలువురు మిత్రులు రాజకీయాలకు అతీతంగా ఆయనను కలుసుకొని గత జ్ఞాపకాలు నెమరువేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కొటికలపూడి చినబాబు ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, కూడా పాల్గొన్నారు.
