సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గత 2 నెలలుగా సరైన సినిమాలు లేక తెలుగు రాష్ట్రాలలో సినిమా హాళ్లు వెలవెల బోతున్న నేపథ్యంలో.. గత 10 రోజుల క్రితం వచ్చిన కుబేర 3 రోజులు క్రితం వచ్చిన కన్నప్ప సినిమాలు హిట్ టాక్ రావడంతో మరల థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి కనపడుతుంది. ఇక భీమవరం లో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ పరిస్థితి గమనిస్తే.. నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘కుబేర’ సినిమా మల్టి ప్లెక్స్ మరియు పద్మాలయ మినీ థియేటర్స్ కలపి గత 9 రోజులకు మొత్తం 38 లక్షల 81వేల 885 రూపాయలు వసూళ్లు సాధించగా నేడు ఆదివారం కలపి సుమారు 42లక్షలు వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ , భీమవరం బ్రాండ్ ప్రభాస్, ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘కన్నప్ప’ సినిమా గత 2 రోజులకు మల్టి ప్లెక్స్ మరియు పద్మాలయ థియేటర్స్ కలపి మొత్తం 10 లక్షల 76వేల 545 రూపాయలు వసూళ్లు సాధించింది. నేటి ఆదివారం కలపి సుమారు 16 లక్షల రూపాయలు సాధించే అవకాశం ఉంది.
