సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో సంక్రాంతి కానుకగా 2 కోట్ల 30 లక్షల రూపాయలతో గునుపూడి సౌత్ డ్రైన్ పై నూతనంగా నిర్మాణం చేసిన తాడేరు వంతనను నేడు, ఆదివారం రోజు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ,కోయ్యె మోషన్ రాజు చేతుల మీదుగా స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నోదశాబ్దాలుగా ప్రజలు గత పురాతన శిధిలమైన తాడేరు వంతెన స్థానంలో కొత్త వంతెన కావాలని చేస్తున్న విజ్ఞప్తి ని నా హయాంలో పూర్తీ చేసినందుకు ఆనందంగా ఉందని, 100 పడకలభీమవరం కమ్యూనిటీ ఆసుపత్రి కూడా పూర్తీ చేసి అతి త్వరలో ప్రారంభిస్తున్నామని దానికి 4 ఎకరాల భూమిని స్వయంగా కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించానని దానికి ముందుగా 10 కోట్ల నిధులు ఇటీవల మరో 20 కోట్ల పైగా నాబార్డ్ నిధులు విడుదల చేసారని.. అలాగే భీమవరం మండలం లో 4 వంతెనలు నిర్మాణాలకు అనుమతులు వచ్చాయని వాటికీ త్వరలో శంకుస్థాపన చేస్తామని, భీమవరం పట్టణం చెత్త వేసుకోవడానికి డంపింగ్ యార్డ్ కు తాడేరు వద్ద 6న్నర భూమి కూడా సేకరించామని, దానిని కూడా వినియోగంలోకి తెస్తామని, అలాగే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యనమదురు కాలవ ఫై ఉన్న పుట్ పాత్ వంతెన తీవ్ర ట్రాఫిక్ తో ఉంటుందని అక్కడ మరో వంతెన కావాలని ఇటీవల సీఎం జగన్ భీమవరం వచ్చినప్పుడు చేసిన ప్రతిపాదన కు వెంటనే అంగీకారం తెలిపారని, ఇవన్నీ శాసనమండలి చైర్మెన్, మోషేను రాజుతోకలసి శంకుస్థాపనలు చేస్తానని వచ్చే ఎన్నికలలో మరోసారి గెలచి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ప్రారంభించిన నిర్మాణాలను సీఎం జగన్ సహకారంతో పూర్తీ చేసి తీరతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *