సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సాంప్రదాయ దసరా పండుగ విశిష్టత ను భావి తరాలకు తెలియజేసే ఉద్దేశ్యంతో దసరా విజయీభవ శోభాయాత్రను ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఒక పండుగకు ఒక సంప్రదాయం ఉందని, ఇది ప్రాచీన సంప్రదాయమని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, చిన్నారులు జైభావ జైజై విజయీభవ అంటూ శోభాయాత్ర చేపట్టడం శుభ పరిణామమని అన్నారు. . అనంతరం చిన్నారులు బాలబాలికలు దుర్గమ్మ అవతార వేషధారణలతో వెళ్లంబులు చేతబట్టుకుని అమ్మవారి కలశాలు గరగలతో జైభావ నినాదాలతో దసరా పద్యాలతో దసరా విజయీభవ శోభాయాత్ర సాగింది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్దా మహాలక్ష్మి నగేష్, బోండా వెంకట సుబ్బారావు, అరసవల్లి సుబ్రమణ్యం, గాదిరాజు రంగరాజు, సర్ సివి రామన్ స్కూల్, సంస్కార్, బర్డోలి, పీఎస్ఎం బలికొన్నత హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
