సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో ఆయనతో పాటు భీమవరం వచ్చిన టీడీపీ “రెడ్ వాలంటీర్లు ” గునుపూడి ప్రాంతంలో స్థానికులపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు వీడియో ఆధారాలతో సహా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారిని భీమవరం లో ఉద్రిక్తత లేకుండా వ్యానులోపలు పోలీస్ స్టేషన్స్ కు త్రిపి త్రిపి తిరిగి భీమవరంలో గత రాత్రి మేజిస్ట్రేటర్ ముందుకు వారిని హాజరు పరిచారు. (వీరిని విడుదల చెయ్యాలని టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమా, తదితరులు లాయర్లు తో వచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి కొద్దీ సేపు డిమాండ్ చెయ్యడం జరిగింది). గౌరవ మేజిస్ట్రేట్ ఇటు పోలీస్ వారి ఆధారాలు అటు టీడీపీ లాయర్లు వాదనలు విన్న తరువాత అరెస్ట్ అయిన వారిలో 36 మందికి ఈనెల 18వ తేదీ వరకు పోలీస్ రిమాండ్ విధించడం తో వారిని నేటి గురువారం తెల్లవారు జామున రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. ముగ్గురిని మాత్రం వారి అనారోగ్యం రీత్యా భీమవరంలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. (రెడ్ వాలంటీర్లు ను విడుదల చెయ్యాలని టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమా, రవి తదితరులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కొద్దీ సేపు డిమాండ్ చెయ్యడం జరిగింది). ఇక గునుపూడిలో జరిగిన ఈ విధ్వంసం లో తాడేపల్లిగూడెం ఏఎస్సై వెంకన్న , భీమవరం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, టూటౌన్ కానిస్టేబుల్ రమేష్ కు రాళ్ల దెబ్బలతో తీవ్రగాయాలయ్యాయి. ఇక పట్టణంలో భీమవరం ఇందిరమ్మ కాలనీ, బ్రిడ్జి పేటకు చెందిన డి.బెంజమన్, ఎం .మహేష్, జి.వెంకటేశ్వరమ్మ , జి.వెంకటేశ్వరరావు, బి.రమేష్, కె.సత్య నారాయణ, ఎం .మణికంఠ, కె.ప్రకాష్, వై.రంగ, డి.ఎలీషా,టి.రవి, బి సునీల్, జి.చిట్టిలు గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *