సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు నేడు, శనివారం దాతల సహకారంతో 22 మందికి స్కాలర్ షిప్స్, ఒక విద్యార్థికి సైకిల్ ను ఎమ్మెల్యే అంజిబాబు చేతులమీదుగా అందించి మాట్లాడారు. ప్రతిభను ప్రతిభావంతులను ప్రోత్సహించాలని, విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదని, తమ దృష్టికి వస్తే వారి ఉన్నత చదువులకు సహకరిస్తామని అన్నారు. పట్టణంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నీక్ విద్యార్థులు 22 మందికి (ఒక్కొక్కొరికి రూ 3 వేలు చొప్పున) రూ 66 వేలు, ఒక విద్యార్థికి సైకిల్ ను భీమవరం వన్ టౌన్ సిఐ నాగరాజు సహకారంతో అందించామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీరామ్మూర్తి, వబిలిశెట్టి రామకృష్ణ, ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు పులఖండం కోటేశ్వరరావు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, చల్లా రాము, తదితరులు పాల్గొన్నారు.
