సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీకమాసం కావడంతో ఈ నెల రోజులు పాటు మాంసాహారం ముట్టనివారి సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో భీమవరంలో చికెన్, మటన్ దుకాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈనెల 12న కార్తీకమాసం ప్రారంభం నుంచి చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. అంతకు ముందు స్కిన్ లెస్ చికెన్ కేజీ 270 రూపాయల వరకు అమ్మగా ప్రస్తుతం మార్కెట్లో కేజీ స్కిన్ లెస్ రూ.180 రూపాయలకు పడిపోయింది. అంటే మూడింటా ధరలో ఒక వంతు పడిపోయింది.లైవ్ కోడి 100 రూపాయలు లోపే ధరకు దొరికేస్తుంది.ప్రస్తుతం కాయగూరలు ధరలు పెరిగాయి. కేజీ ఉల్లిపాయ కూడా 70 రూపాయలు అమ్ముతుంది. గత వారం రోజులు నుంచి ఈ ధరలు ఇదేవిధంగా కొనసాగుతున్నాయి, గతంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రోజు సుమారు 1లక్ష కేజీల వరకు చికెన్ అమ్మకాలు జరుగగా ఇప్పుడు 40 శాతం అమ్మకాలు కష్టంగా ఉంటుంది. ఇక మటన్ ధర కేజీ 800 -750 రూపాయలు స్థిరంగా ఉండటంతో గతంతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు కష్టంగా ఉందని వ్యాపారులు అంటున్నారు. మరో 3 వారలు ఆగితే మరల మాములే కదా.. అంతవరకూ కాస్త ఓపిక..
